రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఎంపిపి గొల్లపల్లి

మనన్యూస్:ఏలేశ్వరం :భద్రవరం గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎంపీపీల సమైక్య అధ్యక్షుడు, ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి పేర్కొన్నారు‌.ఈ మేరకు గురువారం మండలంలోని భద్రవరం గ్రామంలో స్థానిక సచివాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కుశరాజు అధ్యక్షతన నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సులలో భాగంగా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని అలా స్వీకరించిన అర్జీలపై సదస్సులో చర్చించి వీలైనంతవరకు అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపుతారని అన్నారు. గత ఐదేళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం భూ సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో మండల రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించిన నిర్దేశం ప్రకారం గ్రామ సభల్లో ఫ్రీహోల్డ్‌, 22ఏకు సంబంధించిన భూములు,ఇతరత్రా భూ సమస్యలు, వివాదాలపై వినతులు స్వీకరిస్తారు.భూ సమస్యలను సుమారు 45 రోజుల్లోగా పరిష్కరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు,సచివాలయ సిబ్బంది,స్థానిక నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.