

మనన్యూస్:గొల్లప్రోలు సొంత నిధులు లేక సహకార సోసైటీలు కృంగి పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ పేర్కొన్నారు.గురువారం గొల్లప్రోలు సహకార సోసైటి రైతులు తో అవగాహన సదస్సు నిర్వహించారు.సహకార సోసైటీ కార్యదర్శి సూరిబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా సహకార సంఘంలో ఆర్ధికంగా బలోపేతం కావడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ విధానపరమైన నిర్ణయాలు తీసుకొన్న దాని తెలిపారు.ఆ నిర్ణయాలు అమలు ద్వారా సహకార సంఘములు ఆర్ధిక వనరులను పెంపోందించుకొని సభ్యుల అవసరాలు మేరకు పనిచేయవలసిన అవసరం ఉన్నదని, అంతేకాకుండా సంఘం నిర్వహణ ఆర్థిక క్రమశిక్షణ తప్పని సరిగా పాటించాల్సిన అవసరం ఉన్నదని శ్రీనివాస్ అన్నారు.సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా వారికి అవగాహన పెంపోందించడానికి, అలాగే వ్యాపార అభివృద్ధి ప్రణాళికలను రూపొందించు కోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు.సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొందని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ త్రిమూర్తులు, డిసిసి పిఠాపురం బ్యాంకు మేనేజర్ పి.మహేస్ కుమార్, పలువురు రైతులు గొల్లప్రోలు సహకార సోసైటి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.