

మన న్యూస్:తిరుపతి సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కాపుల కోసమే కాకుండా బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి రంగా అని ఆయన అన్నారు.రంగా ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.స్థానిక అనంతవీధి సర్కిల్ లో రాధా రంగ మిత్రమండలి అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వంగవీటి రంగా 36వ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని రంగా చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నాయకుడుగా, ఎమ్మెల్యేగా వంగవీటి రంగా పేదల పక్షాన నిలిచి తుది వరకు పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వూక విజయ్ కుమార్, బుల్లెట్ రమణ, ఆముదాల తులసి రాం,కోడూరి బాలసుబ్రమణ్యం, పాటకం వెంకటేష్, రాజారెడ్డి, ఆముదాల వెంకటేష్, నీలాద్రి, వినోద్ రాయల్, అంజి బాబు, మౌల , శేషాద్రి, తోట జయంతి , శిరీష , మధుబాల తదితరులు పాల్గొన్నారు.