ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపాల్ ఇ. నారాయణగౌడ్
మన ధ్యాస మఖ్తల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రయోగశాల అవసరాల కోసం జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక ప్రత్యేక చొరవ చూపారు. కళాశాలలో ల్యాబొరేటరీ పరికరాల కొనుగోలు నిమిత్తం డి.ఎం.ఎఫ్.టి నిధుల నుండి రూ. 6,82,462/- మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇ. నారాయణగౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల శాస్త్ర విజ్ఞాన ప్రయోగాల మెరుగుదలకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కళాశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు నిధులు మంజూరు చేసినందుకు జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకకు విద్యార్థులు, అధ్యాపక బృందం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పారదర్శకతతో త్వరలోనే ఈ ల్యాబ్ పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.