- బీసీ కోటాలో మేయర్ పదవికి పోటీ చెయ్యమని అధిష్టానం కోరితే నేను సిద్ధం…
- తెలుగుదేశం పార్టీని వదిలే ప్రసక్తే లేదు….
- జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధ అనంతలక్ష్మి…..
మన ధ్యాస ప్రతినిధి గాజువాక అక్టోబర్ 9: జగ్గు సెంటర్ సమీపంలో గల క్లబ్లో సర్వసిద్ధ అనంతలక్ష్మి మనసులో మాట బయటకు పెట్టడం జరిగింది. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రెండు కంపెనీలు నడుపుతూ జీవనం సాగిస్తున్న సమయంలో 2014 తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళ కార్యకర్తగా అడుగుపెట్టి అంచలంచలగా ఎదుగుతూ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఉన్న తరుణం.జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఉవ్వెత్తున ఎగిసిన సమయం నేను ఎప్పుడూ మరువలేనిది.యువ నాయకులు ఐటి మినిస్టర్ నారా లోకేష్ సహకారంతో విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పదవి రావడం నాకు ఎంతో సంతోషం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. సామాన్య కార్యకర్తగా నా జీవనం మొదలుపెట్టి ప్రస్తుతం అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వడం నాకు ఎంతో సంతోషం.గాజువాక శాసనసభ్యులు,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాక ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ గాజువాక అభివృద్ధిలో నా వంతు సేవ చేస్తూ పార్టీకి అనునిత్యం విధేయురాలుగా ఉండడం నాకు ఎంతో సంతోషం. స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బీసీ కోటాలో విశాఖ జిల్లా మేయర్ అభ్యర్థిగా అధిష్టానం ఎన్నికలలో పోటీ చేయమని చెబితే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.ప్రజలు నన్ను ఎంతో ఆదరాభిమానాలతో దీవించడం జరుగుతుంది.నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.