రిపోర్టర్ కమల్ రెడ్డి.

బంగారు పాల్యం, మన ధ్యాస, జూన్ 24

బంగారు పాల్యం మండలం, రోళ్ళవారిపల్లె గ్రామం నందు ఆరేటమ్మ అమ్మవారి గుడిని నూతనంగా నిర్మించి గత మూడు రోజులగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 21వ తేదీన సాయంత్రం పొంగళ్ళు పెట్టడంతో ప్రారంభమై, 22న సాయంత్రం ఐదు గంటలకు గణపతి పూజ, గంగపూజ, అఖండ దీపారాధన జరిపారు. అలాగే 23వ తారీకు ఉదయం 8 గంటలకు వేద పారాయణం, అంకురార్పణం, చండీ ,పారాయణ యాగం నిర్వహించి మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మధ్యాహ్నం ఒక గంటకు దేవతను ఊరేగింపు పరిసర గ్రామాలలో జరిపి అమ్మవారికి ప్రతి ఇంటిలోనూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాత్రి 9 గంటలకు పేట పూజ, యంత్ర పూజ ,సకల దేవత ప్రతిష్టలు జరిపించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి విగ్రహ ప్రతిష్టను వీక్షించి భక్తితో పులకించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, కోలాట కార్యక్రమం, హోమాలు, మేళతాళాలతో, భక్తిమయం చేశారు. ఆరేటమ్మ గుడి ప్రతిరోజు తెరచి ఉండడం జరుగుతుందని భక్తులు కోరిన కోరికలు తీరుతాయని భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృప ని పొందగలరని గ్రామ పెద్దలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *