

మనన్యూస్: తిరుపతి ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఎస్వి మెడికల్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఏ చంద్రశేఖరన్ యూనియన్ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ యూనియన్ సభ్యులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాలని కోరారు హక్కులతో పాటు బాధ్యతలు కూడా సక్రమంగా నెరవేర్చాలని ఆయన సూచించారు 72వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనియన్ నాయకులకు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ లో 1953 డిసెంబర్ 24వ తేదీన ఆవిర్భవించడం జరిగిందని చెప్పారు. యూనియన్ గుర్తింపు ఎన్నికలలో నీ ఇప్పటివరకు ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ గెలుపొంది గుర్తింపు సంఘం లో కొనసాగుతుందని చెప్పారు ఏఐటియుసి అనుబంధంగా వైద్య ఉద్యోగులు సమస్యల కొరకు అనేక పోరాటాలు చేసి సాధించిందని వైద్యరంగంలో పని గంటలను సెలవులు రెగ్యులరైజేషన్ పదోన్నతులు పిఆర్సి లో క్యాడర్ వ్యత్యాసాలు ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ పోరాడి సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర జేఏసీ చైర్మన్ సురేష్ బాబు, రాష్ట్ర కోశాధికారి మహేంద్ర, బ్రాంచ్ అధ్యక్షుడు వీర కిరణ్, ఏపీ ఎన్జీవో కోశాధికారి శ్రీనివాసులు, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గిరికుమార్ డిప్యూటీ సెక్రటరీ భక్తవత్సలం వైస్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి స్వర్ణ, లోకేష్ మొయిద్దీన్ మురళి వర్మ వినోద్ పాల్గొన్నారు.