హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన

మనన్యూస్:తిరుపతి కేంద్ర హోం మంత్రి అమిత్ షా దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకర రీతిలో మాట్లాడటం దుర్మార్గమని, హోం మంత్రి పదవికి ఆయన అనర్హుడని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు, నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ కార్యక్రమం జరిగింది. తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి ర్యాలీగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంవద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాల గురవం బాబు మాట్లాడుతూ దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ అని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగడానికి రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆ మహానుభావుడు పేరు తలుచుకోని దళితులు లేరని అన్నారు. ఆయన పేరు స్మరించవద్దు అన్నట్లుగా అమిత్ షా రాజ్యసభలో చెప్పడం దుర్మార్గమన్నారు. పీడిత వర్గాలకు అంబేద్కర్ దేవుడన్న విషయం గుర్తించాలన్నారు.
తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ తన మిత్రుడు అదానీని కాపాడుకోవడానికి అమిత్ షా ప్రజల దృష్టిని మరల్చడానికి అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడటం జరిగిందన్నారు. ఇది ఏమాత్రం క్షమించడానికి వీలులేదన్నారు. తన తప్పును తెలుసుకొని ఇప్పటికే అమిత్ షా రాజీనామా చేసి ఉండాలని అయితే ఇప్పటికీ ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు అంటే ఇంతకు మించిన నేరం మరొకటి లేదన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అందరికీ సమన్యాయం జరగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పరితపించారని తెలిపారు. ప్రపంచ మేధావిగా గుర్తించబడి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన మా మహానుభావుడుని అవమానకరంగా మాట్లాడటం క్షమించరాన్ని నేరమన్నారు. ఇప్పటికైనా అమిత్ షా రాజ్యాంగ నిర్మాత పట్ల తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పిసిసి పిలుపుమేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టిన ఈ నిరసన విజయం విజయవంతం అయ్యిందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదని దానిని రచించిన అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకొని ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. నేడు బిజెపి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సొంత రాజ్యాంగాన్ని అమలకు ప్రయత్నించడం ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ బిజెపి మతోన్మాద చర్యలకు ఇది పరాకాష్ట అని అన్నారు. భారతదేశం అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళుతోందన్నారు. కానీ బిజెపి మనువాద సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటాచలపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ దామోదర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రామకృష్ణ, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, ఎస్సీ విభాగం కన్వీనర్ బోయిన నరేంద్ర, బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బయలు గోపి, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, రేణిగుంట మండల అధ్యక్షుడు రాహుల్ బోస్, బీసీ విభాగం మాజీ అధ్యక్షుడు చిరంజీవి, దామినేడు రాజా, తిరుపత నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గొడుగు చింతల గోపి, ప్రధాన కార్యదర్శి తలారి గోపి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి