మన ధ్యాస, మక్తల్: పట్టణంలో 250 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. ప్రతిపాదిత పాఠశాల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి నిర్మాణ పనుల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,శర వేగంగా దూసుకెళ్తున్న మక్తల్ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా 250 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ నిలవనుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు మక్తల్ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావికుమార్ ,తయప్ప అదికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *