జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ ఎం. జయకృష్ణ ఆదేశాలు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ఆదేశాల మేరకు, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో హోటళ్లు, షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నగరంలోని హోటల్స్ లో, దుకాణాలలో భక్తులకు, ప్రజలకు అధిక ధరలకు ఆహారం పదార్థాలు విక్రయించినా, పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ ఆదేశాల మేరకు ఆదివారం నగరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితరా ప్రాంతాల్లోని హోటల్స్, దుకాణాల్లో హెల్త్ ఆఫీసర్, లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లోపల, బయట యాత్రికులు వియోగించే ఆహరపదార్దాలు అమ్మే 25 హోటల్స్ మరియ షాప్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిరి ఇందులో ఆర్టీసీ బస్టాండ్ నందు ఎం ఆర్ పి రెట్లకంటే ఎక్కువగా విక్రయించే ఆరు షాపులకు లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ కేసులు వ్రాసి పెనాలిటీ విధించడం జరిగినది మరికొన్నిచోట్లా పాకింగ్ ఆహార పదార్దాలు డేట్స్ ఎక్సపయిరి అయిన వాటిని గుర్తించి స్వాధీనం చేసుకొని డెస్ట్రాయ్ చేయడం జరిగినది మరియు వారికి పెనాలిటీ వేయడమైనది పూర్తిగా నాణ్యత పాటించని బస్టాండ్ లోని శరవణ ఫాస్ట్ ఫుడ్ హోటలను బస్టాండ్ బయట పంజాభి ఢాబా హోటలను తాత్కాలికంగా సీజ్ చేయడమైనది కొన్ని హోటల్స్ ఐన హోటల్ ఒరియాన్, బాలాజీ వుడ్లాండ్స్ హోటల్, టేబుల్ 9 హోటల్స్ నాణ్యత పరిమానాలుపాటించడం తనిఖీలో గుర్తించడమైనది మరికొన్ని హోటల్స్ సరియైన ప్రమాణాలు పాటించక ఎలుకలు తిరగడం, బొద్దింకలు, బల్లులు తిరగడం, హోటల్స్ రూప్ పెచ్చులు లేసిపోవడం, పెయింట్ రాలిపోవడం గమనించడం జరిగింది వారందరికీ పెనాలిటీ వేసి నోటీసులు జారిచేయడమైనది ఫుడ్ సెప్టీ అధికారులు వారి పరిధిలో హోటల్స్ వారికీ హెచ్చరిక లు జారిచేసిరి
ఈ సందర్బంగా తిరుపతి నగర పాలక సంస్థ కమీషనర్ మాట్లాడుతూ నగరంలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు పారిశుధ్య నిర్వహణ కు ప్రత్యేక శ్రద్ద తీసుకోని యత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చేయడమైనదని అలాగే యత్రికులకు నాన్యమైన ఆహరం అందించడంలో హోటల్స్ మరియూ షాపులవారి పై నిరంతరం తనిఖీలు నిర్వహించి నాణ్యమైన ఆహరపదార్దాలు ఎం ఆర్ పి రెట్లకే అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందులో ఎలాంటి అవకతవకలు జరిజిన హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకొని వారి ట్రేడ్ లైసెన్స్ రద్దుచేసి హోటల్ సీజ్ చేయడం జరుగుతుంది మరియూ ప్రతి షాపు వారు, హోటల్స్ వారు ప్రతి ఇంటివారు రెండు డస్ట్ బిన్స్ పెట్టుకొని తడి పొడి వ్యర్థలను వేరుచేసి నిలువవుంచి మునిసిపల్ వాహనాలకు అందివ్వాలని అలాకాక రోడ్లపై పబ్లిక్ స్థలల్లో వ్యర్దాలు పారావేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని మన తిరుపతి ని పరిశుభ్రంగా ఉంచడంలో అందరు నగర పాలక సంస్థకు సహకరించాలని కమిసనర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *