మన ధ్యాస, మక్తల్ :ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక సత్యసాయి దేవాలయం వద్ద వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వనితా క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న, తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత దాదాపు 50 మంది గురువులకు శాలువా కప్పి సన్మానించారు. పనితా క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న మాట్లాడుతూ, ఉన్నత స్థాయికి ఎదగడానికి గురువుల యొక్క ప్రోత్సాహము వాళ్లు నేర్పే విద్య చాలా ముఖ్యమైనదని తెలియజేశారు అలాగే ఇంతమంది గురువులకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.