మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 1: విశాఖలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదును నిరసిస్తూ ఈ రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాసిని వర్మ ఆదేశాల మేరకు జీవీఎంసీ వద్ద గల గాంధీ విగ్రహం పూలమాల సమర్పించి తదనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సోడ దాసి సుధాకర్,మరియు సునంద మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఆయనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ర్యాలీ అనంతరం జరిగిన శుద్ధీకరణ కార్యక్రమంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తమ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీశాయని వాల్మీకి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,జవహర్ నగర్‌కు చెందిన అమిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.ఆయన శ్రీ రామ్ సేన ధర్మార్థ సేవా న్యాస్ సభ్యుడిగా ఉన్నారు.రాహుల్ గాంధీపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 196, 299, అలాగే ఎస్సీ,ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం,1989లోని సెక్షన్ 3(1) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.రాహుల్ గాంధీపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని,దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోడ దాసి సుధాకర్,మహిళా అధ్యక్షురాలు సునంద, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి రజియా, పీసీసీ కార్యదర్శి గాదం మహేష్, సౌత్ మరియు భీమిలి ఇంచార్జిలు కేవీ సూర్యనారాయణ,సవరివిల్లి రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతం మల్లారెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి వంకర ఆనందకుమార్,గుర్రం కనకరావు, అష్మద్ అలీ,రజనీకాంత్,పద్మనాభం ఇంచార్జి ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *