మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
మంగళ వారం సింగరాయకొండ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణం లో 50 లక్షలతో నిర్మించిన వైద్య పరీక్షల లాబ్ ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ పాపులేషన్ మీనేజి మెంట్ కి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభుత్వ సూచనలు పాటించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపు ఇచ్చారు రాను రాను సమాజం లో యువత పురోగతి తగ్గిపోతుందని ఈ పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే సమతుల్యం దెబ్బతింటుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని యువత సంఖ్య పెంచాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా 30 పడకల ఆసుపత్రి అటకెక్కింది అని ప్రజల ఆరోగ్యం దృశ్య ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనా ల మరమ్మత్తులు, చేపట్టేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం లో భాగంగా సంజీవని విధానాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. 50 లక్షలతో చేపట్టిన క్లినిక్ లాబ్ ద్వారా 54 పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు.