- ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి..
- ప్రజలను రోడ్డున నిలబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం..
- నిత్యవసర వుస్తువుల ధరల పై నియంత్రణ ఎక్కడ..
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అధిక ధరలు..
- మరోసారి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు
- ఆర్థిక భారంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తం వాసుపల్లి గణేష్ కుమార్..

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 1:జీవీఎంసీ గాంధీ విగ్రహం ఆయన ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.కూరగాయలు, కాయగూరలు,కోళ్లతో ప్రదర్శన చేపడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని,దీంతో పెరిగిన ఆర్థిక భారంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని, దీనికి కూటమి ప్రభుత్వమే కారణమే విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త,మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను రోడ్డున పడేస్తుందని దుయ్యబట్టారు.ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపోగా,నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగడానికి కారణమైందని మండి పడ్డారు.పక్క రాష్ట్రం తెలంగాణాతో పోల్చితే ఇక్కడ ప్రతీది కూడా నాలుగు రెట్లు అధిక ధరలు ఉన్నాయని ఆరోపించారు.ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.పప్పు,ఉప్పు,బియ్యం,నూనె,కాయగూరలు, ఆకు కూరలు,మాంసం ఇలా ప్రతీది కూడా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు.పెరిగిన ధరలతో సామాన్యుడి పై మరింత ఆర్ధిక భారం పెరిగిందని చెప్పారు.పెరిగిన ధరలు కారణంగా ఒక కుటుంబానికి నెలకు సుమారు రూ.12 వేలు అదనంగా ఖర్చు అవుతుందని తెలిపారు.నెలసరి సరుకులు కోసం అప్పులు చేయాలిసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.నెలకు వచ్చే జీతం కంటే ఇంటి నెలసరి ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు చేసి ఎలా ఖర్చు చేస్తున్నాడో అదే పరిస్థితి సామాన్యుడికి వచ్చిందన్నారు.ప్రజల కష్టాలను పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దద్దమ్మ అని ఎద్దేవా చేసారు.ప్రజలు సరిగా కడుపు నిండా భోజనము చేయలేని పరిస్థితికి తీసుకు వచ్చింది చంద్రబాబే అని మండిపడ్డారు.ఇటువంటి అత్యవసర పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని,కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదన్నారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే ప్రజలకు మంచి జరిగిందని చెప్పారు.ఇటువంటి ప్రభుత్వం మాకు వద్దని అన్నారు.ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం అధికారంలో ఉన్న లేకున్నా ఒకటే అని అన్నారు.రోజు రోజుకు ధరలు పెరిగి,పెరిగిన ధరలు మరింత భారం కావడంతో,ప్రజలు దీని పై గగ్గోలు పెడుతున్న.ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు.పెరిగిన ధరలు పై ప్రజల తరపున వైసిపి చేస్తున్న పోరాటం ఆగదని చెప్పారు.ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను,ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ చెన్నా జానకిరామ్,మాజీ కార్పొరేటర్లు జిల్లా మున్సిపల్ విభాగం ప్రెసిడెంట్ కోడిగుడ్డల పూర్ణిమ శ్రీధర్,బిపిన్ జైన్,వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వరరెడ్డి,దస్మాంతుల మాణిక్యాల రావు, దొడ్డి బాపు ఆనంద్,పిన్నింట్ల రాజారెడ్డి,ఆలుపున కనకరెడ్డి, మహమ్మద్ షకీల్,గురజారపు రవి,ముజీబ్ ఖాన్,కోడిగుడ్ల శ్రీధర్,భీశెట్టి ప్రసాద్,మాజీ కార్పొరేటర్ పచ్చిపల్లి రాము,పద్మనాభ అమ్మాజీ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు,జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు,జిల్లా సెక్రటరీ అభిరెడ్డి అది విష్ణు,స్టేట్ నాయాకులు లండ రమణ,దశమంతులు చిన్ని,ఈతలపాక విజయభాస్కర్,సలాది భాను,వేలంగిని రావు,సాగర్,జిల్లా అనుబంధ సంఘాలు ప్రెసిడెంట్లు వాసుపల్లి ధనరాజు,సకల భక్తుల ప్రసాద్ ,వడ్డది దిలీప్, జిల్లా అనుబంధ సంఘాల ఉపాధ్యక్షులు,సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు,జిల్లా అనుబంధ సంఘాలు, వార్డ్ అనుబంధ సంఘాల అధ్యక్షులు,దక్షిణ వైసిపి సీనియర్ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ వైసిపి మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,మహిళా నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.