కలిగిరి జూలై 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి లో ఆదివారం జలదంకి సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ పై కలిగిరి సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ లతీ పున్నీసా ని కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వెంగప నాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తారని ప్రజలతో సన్నిహితంతో ( ఫ్రెండ్లీ పోలీసింగ్) విధులు నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తారని ఆశాభవం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలకు తక్షణమే స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనీ నూతన ఎస్సై కి ఘన స్వాగతం పలికారు.
