వరికుంటపాడు, జూలై 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్ రెడ్డి
వరికుంటపాడు ఉదయం ప్రతినిధి
ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి శనివారం వరికుంటపాడు ప్రభుత్వ గ్రంథాలయాన్ని సందర్శించిన సందర్భంగా, వరికుంటపాడు సీనియర్ జర్నలిస్ట్ బొడ్డు వెంకటేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో విజ్ఞాన వికాసానికి, పఠన సంస్కృతి పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి చిత్రపటాన్ని స్వీకరించి బొడ్డు వెంకటేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై ఇరువురు పరస్పరం చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *