తిరుపతి జులై 19
కిచ్చన్నగారి పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రిరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి ముల్బాగల్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నిద్ర మత్తుతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఎదురుగా వస్తున్న కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా, ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

