చిత్తూరు జూలై 17: మన ద్యాస
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ప్రవేశాల షెడ్యూల్ ను 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ ను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం చిత్తూరు నందు ఓపెన్ స్కూల్ సొసైటీ చిత్తూరు జిల్లా సమన్వయకర్త జయప్రకాష్ నాయుడు శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమైనందున డీఈఓ కార్యాలయము నందు ఏర్పాటుచేసిన ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ లో ముఖ్యఅతిథిగా జిల్లా సమన్వయకర్త జయ ప్రకాష్ నాయుడు, మరియు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రం నుండి విచ్చేసినటువంటి కోఆర్డినేటర్లు మండల విద్యాశాఖ అధికారులు డివిజన్ విద్యాశాఖ అధికారి వారి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని పాంప్లెట్ మరియు పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం డిసిఓ తో పాటు పలువురు ఏఐ కోఆర్డినేటర్లు, ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్లు పాల్గొని ర్యాలీగా పి సి ఆర్ ఉన్నత పాఠశాల వరకు వెళ్లడం జరిగింది. అనంతరం పిసిఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏఐ కోఆర్డినేటర్ల సమావేశంలో డి సి ఓ జయ ప్రకాష్ నాయుడు పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ జూన్ 29 నుంచి జూలై 30 వరకు అలస్య రుసుం లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఓపెన్ స్కూల్లో అభ్యర్థులు 10వ ప్రవేశాల కోసం అభ్యర్థి గతంలో ఏదైనా పాఠశాలలో చదివిన రికార్డ్ షీట్, టి సి కాపీలను జత చేయాలని, ఇంటర్మీడియట్ కు 10వ తరగతి మార్కుల జాబితా, టిసి, కుల ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు కాపీలను జత చేయాలని ఆయన తెలిపారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల శాతం పెంచాలని, రెగ్యులర్ గా చదివే పిల్లలకు అనేక కళాశాలలు ఉన్నాయని, చదువు మధ్యలో ఆపివేసి, పూర్తి కాని వారు ఓపెన్ స్కూల్ చేరి పూర్తి చేసుకోవడానికి చక్కని అవకాశం ఉందని తెలియజేశారు. ఐదు సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వెసులుబాటు కల్పించిందని అన్నారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సంవత్సర కాలంలో 30 రోజులు తరగతులు నిర్వహించాలని, జిల్లాలోని స్టడీ సెంటర్లు ప్రతి ఆదివారం తెరచి ఉంచాలని, కోరారు. అసైన్మెంట్ పరీక్షలు కాల పట్టిక ప్రకారం నిర్వహించాలని అధ్యయన కేంద్రానికి సంబంధించి అన్ని రిజిస్టర్లను సక్రమ నిర్వహించాలని, మరియు ఉత్తీర్ణత శా తాన్ని పెంచడానికి ప్రతి అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు కృషి చేయాలని తెలియజేశారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా అన్ని గ్రామాలను సందర్శించాలని డ్వాక్రా గ్రూపుల్లో మరియు చదువు మధ్యలో ఆపివేసిన వారి వివరాలు సేకరించి ఓపన్ స్కూల్లో చేర్చి అడ్మిషన్ల సంఖ్యను గత ఏడాది కన్నా రెట్టింపు చేయాలని తెలిపారు. తదుపరి అందరూ ముక్త కంఠముతో అడ్మిషన్ శాతం పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం గంగవరం జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చెంగల్ రెడ్డి, చిత్తూరు విద్యా జూనియర్ కళాశాల కరస్పాండ్ నవీన్ కుమార్, విశ్వేశ్వర జూనియర్ కళాశాల బాలాజీ, మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ శాతం పెంచుతామని తరగతులు సక్రమంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ సాయి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ వాసు, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల కరస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి, విజ్ఞాన జ్యోతి జూనియర్ కళాశాల కరస్పాండెంట్, జానకిరామ్ రెడ్డి ఏఐ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *