తిరుపతి జులై 18.
ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగి మధ్యతరగతి ప్రజలకు ప్రామాణిక నమ్మకాన్ని సంపాదించుకున్న టాటా నూతనంగా ఆవిష్కరించిన సియెర్రా ఈవి, టియాగో ఈవి, టియాగో పెట్రోల్ వర్షన్ లను శనివారం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మన్నెం శ్రీనివాస ప్రసాద్ (జేబి శ్రీనివాస్), జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. తిరుపతి రూరల్ పరిధిలోని విజయభారతి ఆటోమొబైల్స్ లో ఈ నూతన ఆవిష్కరణ కార్యక్రమం ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సభాపతి వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేబి శ్రీనివాస్ మాట్లాడుతూ టాటా సంస్థ తయారు చేసే వాహనాలకు మధ్యతరగతి ప్రజల నుండి మంచి డిమాండ్ ఉంటుందని, ఎంతో మన్నికగా మనిషి ప్రాణానికి విలువనిచ్చి కార్లను తయారు చేస్తారని చెప్పారు. డిటిఓ మురళీమోహన్ మాట్లాడుతూ రతన్ టాటా ఎంతో నాణ్యతతో కూడిన ఉత్పాదనలను దేశానికి అందించాలని లక్ష్యంతో సంకల్పించేవారున్నారు. సీఎం చంద్రబాబు ఆకాంక్షల మేరకు రాబోయే కాలంలో పర్యావరణహితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్ద ఎత్తున ప్రజల వినియోగం కోసం తీసుకొస్తున్నారన్నారు. ప్రజలు ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని చెప్పారు. ఆటోమొబైల్స్ ఎండి వెంకటరమణ మాట్లాడుతూ విజయభారతి ఆటోమొబైల్స్ ద్వారా ఈ ఏడు ప్రతి నెల 150 వాహనాలకు తగ్గకుండా అమ్మకాలు చేస్తున్నామని, గత నెలలో 205 వాహనాలు ఈ షో రూమ్ నుండి డెలివరీ చేశామన్నారు. టాటా ఉత్పాదనలు అంటే మన్నికకు బ్రాండ్ అని, వీఐపీ, వీవీఐపిల కాన్వాయ్ లలో కూడా టాటా సంస్థ తయారు చేసిన వాహనాలని వినియోగిస్తారని గుర్తు చేశారు. ఇక నూతనంగా మార్కెట్లోకి విడుదల చేసిన సియెర్రా ఈవి, టియాగో ఈవిలకు బుకింగ్ ప్రారంభించామని, సియెర్రా ఈవి 18.79 లక్షలు, సియెర్రా ఈవీ, 4.69 లక్షల నుంచి ప్రారంభ ధరగా నిర్ణయించామన్నారు. టాటా సియెర్రా ఈవీ రెండు బ్యాటరీ వేరియంట్ల లో అందుబాటులో ఉందని, 15 నిమిషాల ఛార్జింగ్ తో 250 కిమీ వెళ్ళవచ్చన్నారు. ఈ వేరియంట్ యూఏఈలో ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బపై తన సామర్థ్యాన్ని నిరూపించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో టాటా మోటార్స్ టిఎస్ఎం గౌతమి, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ శివశంకర్, కెనరా బ్యాంకు రీజనల్ హెడ్ ఉమా రాఘవనాథ్, ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ జనరల్ మేనేజర్ నరేష్, ఆటోమొబైల్స్ సిబ్బంది పాల్గొన్నారు.


