ఉదయగిరి జూలై 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఉదయగిరి మండలం ఉదయగిరి పంచాయతీ లోని చెంచురామయ్య నగర్ లో గల చెంచలబాబు అతిది గృహం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో మాజీ జడ్పీ చైర్మన్ పి చెంచల బాబు యాదవ్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానిక శాసన సభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులు బూత్ ఇంచార్జ్ లు ప్రతి పంచాయతీ లో అభివృద్ధి పనులను ప్రచారం చేసి కలసి కట్టుగా ఎన్నికలకు వెళ్లి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఎక్కడ కూడా వైఎస్ ర్ కాంగ్రెస్ పార్టీ కి అవకాశం ఇవ్వకూడధని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ సిహెచ్ భయ్యన్న యాదవ్, చల్లకొలుసు రమణయ్య, రమణారెడ్డి, నల్లిపొగు రాజా, సుబ్బారెడ్డి, అంబటి మస్తాన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *