వైసీపీ నేతలు కలిగిరి తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ కి ఫిర్యాదు..

కలిగిరి జూలై 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలోని సర్వేనెంబర్ 522/2 లో ఉన్న వ్యవసాయ బోర్లను రెవెన్యూ అధికారులు తొలగించడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ చర్య పై వైఎస్ఆర్సిపి నాయకుడు, రైతు, కూలిపోవు ఇర్మియ ఆగ్రహ వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే కక్షపూరితంగా ఈ బోర్లను తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ అన్యాయపు సంఘటనపై జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పండిట కామరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిగిరి మండల అధ్యక్షులు కాటం రవీంద్రారెడ్డి తో కలిసి ఆర్ఐ మోనాలిన్ తెరాసా కు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు ఇర్మియా తెలిపారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని ఇర్మియా కోరారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *