మన ధ్యాస, నెల్లూరు, జూన్ 15 : రాష్ట్ర పురపాలక,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర 16,45వ డివిజన్ల కోకస్టర్,డాక్టర్ పోకల రవి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని విజయమాల్ గేట్ ప్రాంతంలో మంత్రి నారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మంత్రి నారాయణ సతీమణి పొంగురు రమాదేవి పాల్గొని.. నాయకులు,కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి.. ఒకరికొకరు తినిపించుకుంటూ.. మంత్రి నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
