ఘనంగా జూలియన్ రాజు జన్మదిన వేడుకలు

రేణిగుంట విమానాశ్రయం రహదారిలోని అక్షయ క్షేత్రంలో ఉన్న దివ్యాంగుల మధ్య లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ వారి ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా దివ్యాంగులతో కలసి కేక్ కట్ కట్ చేశారు. అనంతరం వారికి స్నాక్స్, అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ మెంబర్ ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో బ్యాంకు ఉద్యోగిగా ఉంటూ పదిమంది పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఆషా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఆనాటి నుంచి సేవా కార్యక్రమాలు జూలియన్ రాజు కొనసాగిస్తున్నారని అన్నారు. మండలంలో సుమారు 50 చేతి బోర్లను వేశారని గుర్తు చేశారు. నేటికీ నిత్యం పేదవారికి ఏదో ఒక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని కొనియాడారు. గిరిజన విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిత్యం సేవచేసే జూలియన్ రాజుకి మరింత సేవ చేసే విధంగా ఆయురారోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ కార్యదర్శి లయన్ కోటేశ్వరరావు,
లయన్ గంగారి రమేష్, లయన్ ప్రభాకర్, లయన్ నవీన్, లయన్ ప్రభు, కుమార్, సింహ, గురు మోహన్, రేణిగుంట మాజీ సర్పంచ్ నగేషం, మండల కో ఆప్షన్ మెంబర్ హాసన్ సాహెబ్, టిడిపి నాయకుడు విద్యాసాగర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *