

చిత్తూరు డిసెంబర్ 17 మన న్యూస్
తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, గుడియాత్తం తాలూకా, పుట్టావారిపల్లిలో లలితమ్మ 85 సంవత్సరాలు, నడక తగ్గడం, వంట చేసుకునే శక్తి లేక ఇబ్బంది పడుతున్న లలితమ్మ పరిస్థితి గమనించిన, గ్రామస్తులు అమ్మఒడికి సమాచారం ఇవ్వగా వెంటనే అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు, తన సిబ్బంది హుస్సేన్, మదు ఆచారి, మురళీ, జరీనా, వెళ్లి అవ్వను అమ్మఒడికి తీసుకుని వచ్చారు లలితమ్మ భర్త చెంగయ్య నాయుడు,20 ఏళ్ల క్రితం చనిపోయాడు,వీరికి పిల్లలు లేరు, ఆస్తులు పోయాయి , ఉన్న బందువులు దూరంగా జీవనం కోసం వెళ్ళిపోయారు, ప్రస్తుతం అవ్వ ఇబ్బంది చూసి అమ్మఒడి కీ తెలిపినాము అని గ్రామస్తులు తెలిపారు అమ్మఒడి సేవలను అభినందించారు.