ఊరందూరులో సందడి…
శ్రీకాళహస్తి
శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ప్రముఖ సినీ హీరో నితిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన ఊరందూరులోని బొజ్జల నివాసానికి చేరుకున్న నితిన్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఉన్న ఆత్మీయ స్నేహం నేపథ్యంలో, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత నితిన్ ప్రత్యేకంగా ఆయనను అభినందించేందుకు ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా ఇరువురు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఇది కేవలం మిత్రుల మధ్య జరిగిన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. టాలీవుడ్ స్టార్ హీరో తమ గ్రామానికి రావడంతో ఊరందూరు ప్రజలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నితిన్‌కు సాదరంగా ఆతిథ్యం ఇచ్చారు. తన ప్రాణమిత్రుడు సుధీర్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా నితిన్ ఆకాంక్షించారు.
