రేణిగుంట మే 13.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
తిమ్మయ్యగుంటలో నివాళి
ముందుగా రేణిగుంట మండలం, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని తిమ్మయ్యగుంట గ్రామానికి వెళ్లిన సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాధవరెడ్డి కోడలు దివంగత గాయత్రి రెడ్డి కర్మక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. గాయత్రి రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన, మాధవరెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.
సుధాకర్ రెడ్డి కుటుంబానికి ధైర్యం
అనంతరం ఏర్పేడు మండలం, చిన్న అంజిమేడు గ్రామంలో దివంగత చిత్తానూరు సుధాకర్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటని పేర్కొంటూ, పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.




