

మన న్యూస్: కామారెడ్డి జిల్లా శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యశాల దగ్గర నిర్వహించడం జరిగింది. వంశాభివృద్ధి కుటుంబ సంక్షేమం కోసం ఈ అన్నదాన కార్యక్రమాన్ని గడిచిన 9 నెలలుగా జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని ఈ అన్న ప్రసాదాన్ని 500 మంది భక్తులు స్వీకరించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి 50 మంది దాతలు ప్రతినెల 251 రూపాయలు చెల్లించడం జరుగుతుందని వారికి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానుల ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించడం జరిగింది,ప్రతి నెల వందలాదిమందికి అన్న ప్రసాదం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన చాలామంది పేషంట్ల సహాయకులకు ఈ అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నవారు ప్రతినెల 251 రూపాయలను ఈ కార్యక్రమ సమన్వయకర్త ఎర్రం చంద్రశేఖర్ 9849601438 కి పంపించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయ సేవకులు ఎర్రం విజయ్ కుమార్,సిద్ధంశెట్టి శ్రీనివాస్,పార్షి శ్రీనివాస్,గౌరిశెట్టి నాగేశ్వర్ రావు,ఆలయ న్యాయ సలహాదారులు డాక్టర్ బాలు పాల్గొనడం జరిగింది.