అంతా తానై మానవత్వం చాటిన రవీందర్ రెడ్డి గురుకుల విద్యార్థి అమూల్యకు వైద్య సహకారం వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన మంత్రి సీతక్క, తనయుడు ధనసరి సూర్య.

మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పెంటన్నగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి గుమాసు అమూల్య ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైంది. పాల్వంచ లోని నవభార గురుకుల విద్యాలయంలో అమూల్య 9వ తరగతి చదువుతుంది. వాలీబాల్ ప్లేయర్ అయిన ఈమె ఇటీవలే జరిగిన సీఎం కప్ ఆటల పోటీల్లో పాల్గొంది. అమూల్య జట్టు మండల స్థాయి వాలీబాల్ పోటిల్లో విజయం సాధించి ఖమ్మం జిల్లా వైరాలొ జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంది. అనంతరం తిరిగి తమ గురుకుల పాఠశాలకు వచ్చాక తీవ్ర జ్వరం, జలుబుతో అస్వస్థతకు గురైంది. మూడు రోజుల క్రితం గురుకుల బాధ్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన భద్రాచలంలోని కిమ్స్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్లేట్లెట్స్ బాగా పడిపోయి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటంతో మూడు రోజుల చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆర్థిక దుస్థితిలో ఉన్న అమూల్య కుటుంబానికి ఈ ఆసుపత్రిలో కూడా రూ. 45 వేల వరకు వైద్య ఖర్చులు కాగా మొత్తం కట్టారు. కాగా భద్రాచలం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు సూచన చేస్తూ అమూల్యను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరిలించాలని చెప్పారు. దింతో చేసేది లేక బిడ్డను బతికించుకోవడం కోసం ఆదివారం తెల్లవారుజామున నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే నిమ్స్ లొ వైద్యం కోసం బెడ్స్ ఖాళీ లేవని ఆసుపత్రి బాధ్యులు తిరస్కరించారు. దీంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.. బిడ్డను కాపాడుకునే తపన… ఆందోళనలొ సమీపంలో వున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలొ చేర్పించారు. ఆ ఆసుపత్రిలో అమూల్యను ఐ సి యు లొ ఉంచి వైద్యం ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రానికే రూ. 50 వేల వరకు బిల్లు వేశారు. ఈ పరిణామంతో అమూల్య తండ్రి సన్నకారు రైతు అయిన వెంకటేశ్వర్లు వెంట తీసుకెళ్లిన డబ్బులు మొత్తం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుల్లో ప్రవేట్ ఆసుపత్రుల్లో మానవత్వం, మనిషి పట్ల కనికరం మచ్చుకైనా కనిపించడం లేదు. చేతుల్లో చిల్లి గవ్వ లేక తండ్రి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ లొ ఒక్కరోజు గడవకముందే నానా అవస్థలు ఎదుర్కొన్నారు. బీదవాళ్లకు పెద్ద జబ్బులు వస్తే ఇక మరణమే శరణ్యంగా భావించారు. చేతుల్లో డబ్బులు లేక ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో గంట గంటకు మందులు, వివిధ పరీక్షల పేర బిల్లులు కట్టలేక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ దశలో మంత్రి సీతక్క, ఈమె తనయుడు ధనసరి సూర్య దృష్టికి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క, సూర్య నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించేందుకు చర్యలు తీసుకుని సహకరించారు. దీంతో అమూల్య కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఆమె ను శనివారం రాత్రికి రాత్రి నిమ్స్ కు తరిలించారు. మంత్రి కలగజేసుకుంటే గాని నిమ్స్ ఆసుపత్రిలో బెడ్ , వైద్యం అందలేదు. నిమ్స్ కు తరలించే విషయంలో రవీందర్ రెడ్డి కూడా చాలా సహకరించారు. స్వయంగా ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స కోసం రవీందర్ రెడ్డి కృషి చేసి బాధిత కుటుంబానికి తానున్నానని ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. స్వయంగా అమూల్య దగ్గరికి వెళ్లి పరామర్శించి, చికిత్స ఎలా అందిస్తున్నారో వైద్యులతో మాట్లాడి తెలుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వున్న వెంకటేశ్వర్లు కుటుంబానికి రవీందర్ రెడ్డి అందించిన భరోసా, సహకారంతో ఆ కుటుంబానికి ఓదార్పు లభించింది.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా