తవణంపల్లి మనద్యాస ప్రతినిధి ఏప్రిల్ 29 (నాగరాజ సరకింటి )

తవణంపల్లి మండలం నరసింహనపల్లి గ్రామంలో ఎస్సై రమేష్ బాబు సిబ్బందితో కలిసి పర్యటించారు. గ్రామ ప్రజలతో సమావేశమై మహాభారతం వంటి సాంప్రదాయ విలువలపై అవగాహన కల్పించడంతో పాటు గంజాయి వినియోగం దుష్ప్రభావాలు, మహిళలపై జరిగే నేరాల నివారణపై వివరించారు.ఈ సందర్భంగా గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని ఆయన తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలు, యువత తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులను సంప్రదించాలని ఎస్సై రమేష్ బాబు కోరారు.కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *