మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం (దొండపర్తి)30 ఏప్రిల్ : ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు(గణబాబు)విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ (DRM)లలిత్ బోహ్రా మర్యాదపూర్వకంగా కలిసి,తన నియోజకవర్గ పరిధిలోని పలు కీలక రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా గవరు కంచరపాలెం మరియు ఆర్.పి. పేట ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు మరియు సాధించిన పురోగతి గవరు కంచరపాలెం మార్కెట్ ప్రాంతంలో అండర్ పాస్ గవరు కంచరపాలెం మార్కెట్ ఏరియాలో పాదచారుల సౌకర్యార్థం సబ్-వే(అండర్ పాస్)ఏర్పాటు చేయాలని గతంలోనే కోరగా ముఖ్యంగా వృద్ధులు మరియు దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వినియోగదారులకు అనుకూలమైన ఈ అండర్ పాస్ నిర్మాణం ఉండాలని సూచించారు.

ఆర్.పి.పేట లెవల్ క్రాసింగ్ సమస్య

ఆర్.పి. పేట వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్‌ ప్రస్తుతం మూసివేయడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఒకవేళ భవిష్యత్తులో మూసివేయాల్సి వస్తే,ప్రత్యామ్నాయంగా 5.5 మీటర్ల ఎత్తుతో కూడిన రైల్వే అండర్ పాస్ ను నిర్మించాలని,వర్షాకాలంలో అండర్ పాస్ లో నీరు చేరితే ప్రత్యామ్నాయ మార్గంగా లెవెల్ క్రాసింగ్ ను ఆపరేషన్లో ఉంచాలని కోరారు.దీనివల్ల బస్సులు,అంబులెన్స్‌లు వంటి వాహనాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సులభంగా వెళ్లే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *