బంగారుపాళ్యం,మన ధ్యాస, ఏప్రిల్23

రిపోర్టర్ కమల్ రెడ్డి

బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 9వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లు గా ఎస్సై ప్రసాద్, బంగారుపాళ్యం సర్పంచ్ ఎం. బి. ఉమాదేవి కృష్ణమూర్తి లు పాల్గొనారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి నిలు సమాజంలో వ్యవహరించాల్సిన తీరు పై అవగాహన కల్పించారు. సమాజ సేవ మరియు ఆర్థిక నేరాలు అనే విషయాలను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎన్ జ్యోతినాథ్ అతిథులుగా విచ్చేసిన ఎస్ఐ ప్రసాద్ మరియు సర్పంచ్ ఉమాదేవి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ చైర్మన్ ఆర్ ఎన్ జ్యోతినాథ్, ప్రిన్సిపల్ రాణి, ఇంచార్జ్ హిమగిరి, డైరెక్టర్ రవితేజ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు , వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *