4 నెలల్లో 39,668 మందికి కంటి పరీక్షలు- 22,231 మందికి ఉచిత కళ్లజోడుల పంపిణీ..!
వేలాది కుటుంబాలలో వెలుగులు నింపిన విపిఆర్ నేత్ర.
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం.

కలిగిరి ఏప్రిల్ 22న, మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు.

కలిగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “విపిఆర్ నేత్ర” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ,ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ హాజరై కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి విస్తృతంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గత మూడు నెలల కాలంలో నియోజకవర్గంలోని 143 పంచాయితీలకు గాను 126 పంచాయితీలలో నేత్ర శిబిరాలు నిర్వహించి, మొత్తం 39,668 మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో 22,231 మందికి ఉచితంగా కళ్లజోడులను పంపిణీ చేయడం ద్వారా వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపామని పేర్కొన్నారు.“విపిఆర్ నేత్ర” కార్యక్రమం వేలాది కుటుంబాలకు చూపు మాత్రమే కాకుండా ఆశలను కూడా అందించిన ఒక గొప్ప ఆరోగ్య యజ్ఞంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, విపిఆర్ నేత్ర రథం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు సమగ్ర నేత్ర వైద్య సేవలు అందించడం ఎంతో ప్రశంసనీయం అని ఆయన తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.అంతేకాకుండా విపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ, ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహకారం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, కలిగిరి మండల అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, మాజీ ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య, కలిగిరి సొసైటీ అధ్యక్షులు కదిరి వెంకట రంగారావు, ఊస మాల్యాద్రి, చేరెడ్డి సుబ్బారెడ్డి, ఊస మధు, నిశంకర సురేష్,వేమిరెడ్డి కొండారెడ్డి, తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *