కలిగిరి ఏప్రిల్ 22 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి మండలములోని కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ను గుంటూరు జోన్ విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి లింగేశ్వరరెడ్డి పర్యటించి కలిగిరి మండలములోని అన్నీ గ్రామాలలో బడిఈడు పిల్లలందరినీ బడి బయట లేకుండా అందరినీ ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసే విధముగా, డ్రాప్ అవుట్ అనేది జీరో పర్సంట్ ఉండేవిధంగా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన అకాడమిక్ స్టాండర్డ్స్ సాధించేవిధముగా, 5సంవత్సరాలు నిండిన విద్యార్థులకోసం “బడిపిలుస్తుంది….!” అనే కార్యక్రమంను సమర్ధవంతముగా నిర్వహించి అందరూ ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు ఈ దిశగా కార్యాచరణ రూపొందించుకొని, గ్రామాలలోని అందరి సహాయ సహకారములతో మంచి ఫలితాలు సాదించాలని కలిగిరి మండల విద్యాశాఖాధికారి గోళ్ళ సురేష్ కి, కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి వి వెంకట లక్ష్మి శ్రీ ,కి, ఏ.పి. మోడల్ స్కూల్, కలిగిరి ప్రిన్సిపాల్ శ్రీ శ్రీనివాసులు కి దిశా నిర్దేశం చేశారు.* ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి మారెళ్ల హరిప్రసాద్ పాల్గొన్నారు. అర్జెడి కలిగిరి మండలములోని ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అందరికి మండలములోని బడిబయట పిల్లలు అందరినీ గుర్తించి, ఆ పిల్లలును ప్రభుత్వ బడులలో చేర్చేవిధంగా, ఈ సంవత్సరం ప్రభుత్వబడులలో నూతన అడ్మిషన్స్ గత సంవత్సరం కన్నా ఎక్కువ ఉండేవిధముగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆయన సూచనలు చేశారు.