మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూర్,గున్కుల్ సొసైటీ పరిధిలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,మొహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీఈవో సంగమేశ్వర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సి డి సి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, మల్లూరు సొసైటీ కేంద్రంలో సిఈవో సాయిలు లు కలిసి కాంటాకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని ధాన్యాన్ని దళారులకు నమ్మి మోసపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ స్వర్ణలత,నాయకులు ఆకాష్, కాశయ్య,ఇఫ్తికార్,సర్పంచ్ రాజు,గ్రామ అధ్యక్షుడు చాకలి సాయిలు, పంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ, శ్రీకాంత్ రెడ్డి రామా గౌడ్,ప్రజా పండరీ,వకీల్ రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.