తిరుపతి జిల్లా మన ధ్యాస:– ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలు లభించడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు, ఒకరికి ఉత్తమ సేవా పతకం ప్రకటించబడింది. ఈ అవార్డులు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతాయని ఎస్పీ తెలిపారు.పతకాలు అందుకున్న అధికారులను అభినందించిన ఎస్పీ, ప్రజలకు నిబద్ధతతో సేవలు అందిస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు. భవిష్యత్తులో కూడా కర్తవ్యనిబద్ధతతో పనిచేయాలని కోరారు.అంకితభావంతో పనిచేసే సిబ్బందికి ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.
సేవా పతకాలు పొందిన వారు:
ఎన్. విక్రం (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్), బి. తిరుపాలు (ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్), ఈ. అనంతరావు (హెడ్ కానిస్టేబుల్, క్రైమ్ కంట్రోల్ సిస్టమ్, తిరుమల), ఆర్. పద్మావతి దేవి (ఏఎస్సై, అలిపిరి పోలీస్ స్టేషన్), ఆర్.వి. వేణు (ఏఎస్సై, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్), ఎన్. రాజశేఖర్ (హెడ్ కానిస్టేబుల్, క్రైమ్ కంట్రోల్ సిస్టమ్), ఎస్.కె. ఖాజా హుస్సేన్ (హెడ్ కానిస్టేబుల్, సుళ్లూరుపేట పోలీస్ స్టేషన్), ఎం. గుణశేఖర్ (పోలీస్ కానిస్టేబుల్, జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో), ఆర్.సి. ఓబులేష్ యాదవ్ (ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్), పి. శ్రీనివాసరావు (ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్).
ఉత్తమ సేవా పతకం పొందిన వారు:
ఎన్. శేఖర్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, స్పెషల్ బ్రాంచ్).