తిరుపతి, మార్చి 08 : – తిరుపతిలోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ వద్ద అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ సమీపంలో ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నట్లు వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సి.ఆర్. రాజన్ తెలిపారు. శుక్రవారం తిరుపతిలో వన్నియకుల క్షత్రియ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సి.ఆర్. రాజన్ మాట్లాడుతూ వన్నియకుల క్షత్రియలు రానున్న రోజుల్లో ఐక్యంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. వన్నియకుల క్షత్రియులను ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని అంశాల్లో వన్నియకుల క్షత్రియులు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.వన్నియకుల క్షత్రియులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 8న నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ వద్ద అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ దగ్గర నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి వన్నియకుల క్షత్రియ సోదరులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సంఘం ఉద్దేశ్యం వన్నియకుల క్షత్రియుల్లో వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం అందించడం, స్కాలర్షిప్ కార్యక్రమాలు నిర్వహించడం, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం, స్వంత వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించడం మరియు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయడం అని తెలిపారు. ఈ కార్యక్రమంలోర్రి సి. ఆర్. రాజన్ వన్నెకుల క్షత్రి సంక్షేమ సంఘం కార్పొరేషన్ చెల్లన,అయ్యగారి బాలసుబ్రమణ్యం వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్, మునిరత్నం , కార్పొరేషన్ డైరెక్టర్, తేజోవతి వన్ని కుల కార్పొరేషన్ డైరెక్టర్ మరియు వన్నే కుకల పెద్దలు కుటుంబలు ఫాల్గన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *