మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లో జరిగిన వాతావరణం లో వచ్చే మార్పు పై లయ సంస్థ, డిగ్రీ కళాశాల విద్యార్థుల చే సంయుక్తం గా నిర్వహించే కార్యక్రమం కి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సునీత అధ్యక్షతన మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి లో వాతావరణం లో వచ్చే పెను మార్పు లను ముందుగానే ఉహించి ఏలేశ్వరం పట్టణం విద్యార్థుల చే సర్వే నిర్వహించడం వల్ల భవిష్యత్ లో వచ్చే పరిణామం ల గూర్చి ముందుగానే గ్రహించ వచ్చు అన్నారు .ఈ కార్యక్రమం లో పాల్గొన్న లయ ప్రతినిధి పి.శ్రీను మాట్లాడుతూ ఏలేశ్వరం పట్టణం లో 20 వార్డ్ లాల్లో నివసిస్తున్న ప్రజల జీవన పరిస్థితి, వారి అవసరాలు, భవిష్యత్ లో ప్రజల కు ఏ ఏ అవసరాలు, వారికీ కావాలి. ఎంత మందికి స్వంత ఇండ్లు ఉన్నాయి. ఇంకా ఎంత మందికి ఇండ్లు లేవు. దరిద్రరేఖ దిగువలో ఉన్నారు. వారి ఆదాయం వివరాలు తదితర అంశాలు విద్యార్థులకు వివరించారు. ఈ అవగాహన సదర్స్ ద్వారా భవిష్యత్ లో సోలార్ ద్వారా విద్యుత్ వినియోగం, మంచినీటి వనరుల అభివృద్ధి ఏవిధం గా చేయొచ్చు అనే అంశాలు సేకరణ కు విద్యార్థుల నేర్చుకోవాలని భోటని లెక్చలర్, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ ప్రయాగ మూర్తి ప్రగాఢ తో పాటు ఆదివాసీ అభ్యుదయ సొసైటీ సంస్థ కార్యదర్శి పట్నాయక్ డిగ్రీ కళాశాల విద్యాధిని, విద్యార్థులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *