మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జనసేన నాయకుడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) పిలుపు ఈ నెల ఫిబ్రవరి 26 నుండి మార్చ్ 10 లోపు జనసేన సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళవారం జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్తిపాడు నియోజవర్గం సమన్వయకర్త మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి)మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చేర్చడంలో పాటు పార్టీ ప్రతిష్టకు పాటు పడాలని సూచించారు.జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ మహా యజ్ఞం లో ప్రతి ఒక్క జనసైనికులు వీర మహిళలు అండగా నిలిచేందుకు వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఉద్దేశంతో కొత్తతరం నాయకులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో.జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత శ్రీకారం చుట్టారని మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) తెలిపారు.ఈ సందర్భంగా మేడిశెట్టి సూర్య మాట్లాడుతూ జనసేన అధినేత ఆదేశాల తో ఉద్యమి సభ్యత్వాల ను జిల్లా ఇన్చార్జి పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ సూచనలతో ప్రత్తిపాడు నియోజవర్గం ఉద్వమిని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. మార్పు అనేది ఒక్క మాటతో ఆగిపోకూడదు అది ఒక సంతకంతో ఒక సభ్యత్వంతో మొదలవ్వాలి మన ఆశయాలకు ప్రాణం పోసేందుకు మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు ఈనెల 26వ తేదీ నుంచి మనం ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ సభ్యత్వ ఉద్వమినీ రాష్ట్రంలో ముందంజలో ఉండేలా కృషి చేస్తానని తెలిపారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *