మన ధ్యాస,నెల్లూరు.,ఫిబ్రవరి 22 : పచ్చదనం పర్యావరణానికి మారుపేరుగా అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫామ్ ల్యాండ్ నిలవనుందని వెంచర్ వ్యాపార మిత్రులు రఘునాథ కమల్ పేర్కొన్నారు.అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ అధినేత గండవరం వెంకురెడ్డితో కలిసి వెంచర్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేయబడిన అంజనా గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ వెంచర్ లో కస్టమర్స్ సౌకర్యార్థం ఆదివారం కస్టమర్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… నెల్లూరు నగరానికి అతి సమీపంలో నెల్లూరు నుండి పొదలకూరు వెళ్ళు ప్రధాన రహదారికి సమీపంలో, పొదలకూరు ప్రధాన రహదారి నుండి పాలచర్లపాడు మీదుగా కసుమూరుకి వెళ్ళు రహదారికి సమీపంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ను పర్యావరణ ప్రేమికుల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ వెంచర్ లో ప్లాట్స్ బుక్ చేసుకున్న వెంటనే కస్టమర్స్ కోరిక మేరకు మరియు అంజనా గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ నియమ నిబంధనలకు లోబడి పండ్ల మొక్కలు, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే వివిధ మొక్కలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. కస్టమర్స్ కొన్న ఫ్లాట్లలో ప్లాంటింగ్ చేయబడిన మొక్కలను 2 సంవత్సరాల వరకు అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ సంస్థ పర్యవేక్షణ చేస్తుందని ఇందుకు అవసరమైన ఖర్చును మేమే భరిస్తామని తెలియజేశారు. వెంచర్ చుట్టూరా ప్రహరీ, వాచ్మెన్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. కస్టమర్స్ కొన్న ప్రతి ప్లాట్లు ఏర్పాటు చేయబడిన మొక్కల సంరక్షణతో పాటు పర్యవేక్షణ కూడా చూస్తామని మరోసారి ఇచ్చారు. పర్యావరణ ప్రేమికులు అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ను సందర్శించి ప్లాట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *