
మన ధ్యాస ప్రతినిథి కిర్లంపూడి:కిర్లంపూడి నుండి రాజుపాలెం వెళ్లే దారిలో ఉన్న అనిల్ పార్కింగ్ టైల్స్ వద్ద అధినేత సేనాపతి కన్నబాబు, విజయ దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా సేనాపతి కన్నబాబు మాట్లాడుతూ కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన సత్తెమ్మ తల్లి అమ్మవారిని నిత్యం పూజించడం ఆనాయితీగా వస్తుందన్నారు.దీనిలో భాగంగా వేప చెట్టు వద్ద ఉన్న అమ్మవారికి ఆలయాన్ని నిర్మించడమేకాకుండా ఆదివారం 11:54 నిమిషాలకు సత్తమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని అనిల్ పార్కింగ్ టైల్స్ ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చి శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఈ సందర్భంగా సేనాపతి కన్నబాబు భక్తులను కోరారు.