మన న్యూస్: కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన చిత్తూరు మన న్యూస్ మీడియా స్వేచ్ఛ ను హరించడం అన్యాయం అని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా వేముల వద్ద సాగునీటి సంఘం ఎన్నికలను చిత్రీకరించడానికి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై అక్కడి టిడిపి నాయకులు దాడులకు పాల్పడి గాయపరచడం బాధాకరమన్నారు. విధుల నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడానికి ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటనపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదని, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.దాడికి పాల్పడ్డ వ్యక్తులపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పోలీసు యంత్రాంగం తీసుకోవాలన్నారు.అనంతరం ఇంచార్జి కలెక్టర్ విద్యాధరి కి వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, ఏపీయూడబ్ల్యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ కుమార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శివప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు గజపతి, శివ కుమార్, మహేష్,వీర రాఘవులు నాయుడు,చంద్ర శేఖర్ రావు, రాజేష్ కుమార్, హరీష్, తేజ, అయ్యప్ప నాయుడు,చంద్ర, జయకుమార్, శివ,సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.