పూతలపట్టు ఫిబ్రవరి 01 మన ద్యాస
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా,కుప్పం విచ్చేసిన ముఖ్యమంత్రి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం జనసేన నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన తర్వాత ఎం.మహేష్ స్వేరో మాట్లాడుతూ జనసేన నాయకులను చూడగానే ఎంతో ఆత్మీయంగా పలకరించి పూతలపట్టు నియోజకవర్గ విషయాలను,అక్కడి పరిస్థితులను, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి స్థితిగతులను,పలు అంశాల గురించి అడిగి తెలుసుకుని,భవిష్యత్తులో ఏమైనా అవసరం ఉంటే తమను సంప్రదించాలని తెలియజేసిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నదని కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేయడానికే ఉంటుందని తెలిపారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తమతో చాలా ఆత్మీయంగా మాట్లాడి, నియోజకవర్గంలో పలు విషయాల గురించి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన పూతలపట్టు జనసేన నాయకులు. అతి త్వరలో పూతలపట్టు నియోజకవర్గంలో పలు అంశాల పట్ల, కొన్ని అభివృద్ధి పనుల పట్ల మరొకమారు ముఖ్యమంత్రి ని కలవబోతున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య , యాదమరి మండల అధ్యక్షులు కుమార్ ,ఐరాల మండల అధ్యక్షులు కక్కే పురుషోత్తం ,ఐరాల మండల ఉపాధ్యక్షులు వాసు రాయల్ ,యాదమరి మండల సీనియర్ నాయకులు ప్రభాకర్ ,ఐరాల కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..