చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి2

2025లో మామిడి రైతులు అన్ని విధాలా నష్టపోయారు ఈ సీజన్లో నైనా మామిడి రైతులని ఆదుకోవాలి(ఎం ఎఫ్ ఏ ) మామిడి రైతుల సంఘం వినతి. ఈరోజు మామిడి రైతు సంఘం అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన రైతు సంఘం నాయకులు చిత్తూరు కలెక్టర్ ని కలిసి భవిష్యత్తులో మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు .ఉపాధి హామీ పథకాన్ని మామిడి పంట కు అనుసంధానం చేయాలని, ఎరువులు పురుగు మందులు 50% సబ్సిడీ ధరకు రైతులకు అందించాలని, మామిడి కవర్లు సబ్సిడీ కి అందివ్వాలని, కొత్త మామిడి ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రత్యేకంగా మామిడి సెజ్ ఏర్పాటు , మామిడి స్టాల్స్ ఏర్పాటు, మామిడిని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు , సీజన్లో పర్యవేక్షణ కమిటీలు , మ్యాంగో బోర్డు ఏర్పాటు, పట్టణాలలో సంతలు, మామిడి బజార్ లాంటి వేదికలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిష్కార దిశ గా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పి.ఎల్. సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు పి.హేమలత కె.మునిరత్నం నాయుడు,కార్యదర్శులు జి.త్యాగరాజరెడ్డి,సందీప్ రెడ్డి,మోహన్ రెడ్డి, భారతి, జయదేవయ్య , చెంగల్రాయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *