నీటిని పొదుపుగా వాడుకోవాలి.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదయిని అయినా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు యాసంగి సీజన్ క గాను ,మొదటి విడత నీటిని ప్రధాన కాలువకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్రావుతో కలిసి సంజీవ్ పంతులు ఆధ్వర్యంలో పూజ నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి శుక్రవారం విడుదల చేశారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి సీజన్లో ఒక లక్ష 25 వేల ఎకరాల్లో పంటలు వేస్తున్న దృష్ట్యా వేసిన పంటలకు ఆరు విడతలగా నిజాంసాగర్ నీటిని అందిస్తామని ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.నిజాంసాగర్ ప్రాజెక్టులో యాసంగి సీజన్ కు తో పాటు, వర్షాకాలం పంటలకు కూడా నీరు అందించే విధంగా నీళ్లు ఉండడంతో రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా నిజం సాగర్ నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలని మంత్రి వెల్లడించారు. నిజామాబాద్ పట్టణ వాసులకు తాగునీరు అందించడంతోపాటు, ఈ యాసంగి సీజన్లో నిజాంసాగర్ ఆయకట్టు కింద ఒక లక్ష 25 వేల ఎకరాలకు సాగుదీరు ఆరు విడతలుగా అందిస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి వెల్లడించారు. అనుకున్న సమయానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని, ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేసే గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు మల్లికార్జున్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..