మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు వృక్ష శాస్త్ర మరియు జంతు శాస్త్ర ఆద్వర్యంలో ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (పి‌ఎం ఉషా)ఆర్దిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత,సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంపొందించేందుకు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు ఘనంగా నిర్వహిస్తున్నామని . ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పర్యావరణ నిపుణులు, విధాన రూపకర్తలు మరియు విద్యావేత్తలు పాల్గొన్నారని .సదస్సులో జీవ వైవిధ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావం, అడవులు–వన్యప్రాణుల సంరక్షణ, జీవ వనరుల సుస్థిర వినియోగం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయని.భవిష్యత్ తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వక్తలు ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలియజేశారు. ఏలేశ్వరం వంటి ప్రాంతంలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం,సదస్సుకు మంచి స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి ఆచార్య విక్టర్ బాబు, ఉపకులపతి, ప్రిన్ కాన్సర్న విశ్వవిద్యాలయం,లిమా, పెరు దక్షిణ అమెరికా ముఖ్య అతిది గా పాల్గొని ప్రసంగిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణతోనే భవిష్యత్ తరాల భద్రత అని జీవ వైవిధ్యం అనేది ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరం. భూమిపై జీవన సౌందర్యం, మానవ మనుగడ, పర్యావరణ సమతుల్యత అన్నీ జీవ వైవిధ్యంతోనే అనుబంధమై ఉన్నాయని. ఈ నేపథ్యంలో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ఎంతో అభినందనీయమైన విషయమని. నేడు వాతావరణ మార్పులు,అడవుల నరుకుడు, కాలుష్యం వంటి కారణాల వల్ల అనేక జీవ జాతులు అంతరించిపోతున్న ప్రమాదకర స్థితిలో ఉన్నాయని . ఇది మనందరికీ హెచ్చరికగా భావించాలని . జీవ వనరులను విచక్షణ లేకుండా వినియోగిస్తే భవిష్యత్ తరాలకు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని .ఈ సదస్సు ద్వారా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు, విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చి ఆలోచనలు పంచుకోవడం ఎంతో అవసరం. పరిశోధన ఫలితాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా,విధానాల రూపకల్పనలో మరియు ఆచరణలోకి రావాలని కోరారు .ప్రతి పౌరుడు జీవ వైవిధ్య పరిరక్షణలో భాగస్వామిగా మారాలి.ప్రకృతిని కాపాడుకోవడం అనేది మన బాధ్యత మాత్రమే కాదు, మన ధర్మం కూడా. ఈ సదస్సు జీవ వైవిధ్య పరిరక్షణకు ఒక దిశానిర్దేశకంగా నిలవాలని, ఇక్కడి నుంచి వెలువడే ఆలోచనలు ప్రపంచానికి మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలీయజేశారు.డా. చప్పిడి కృష్ణ జాయింట్ డైరెక్టర్ ఒఫ్ కాలిజియెట్ ఎడ్యుకేషన్ , విజయవాడ,విద్యార్డులకు జీవ వైవిద్య ఆవశ్యకత మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య వత్సవాయ రాజు, కాకతీయ విశ్వవిద్యాలయ కీలక ఉపన్యాసం చేస్తూ జీవ వైవిధ్యం అనేది కేవలం మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల సమాహారం మాత్రమే కాదని — ఇది భూమిపై జీవన వ్యవస్థకు ఆధారం, మానవ మనుగడకు మూలస్తంభమని .నేడు మనం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో జీవిస్తున్నాం.కానీ అదే సమయంలో అడవుల నరుకుడు, వాతావరణ మార్పులు, కాలుష్యం, భూమి వనరుల అతివినియోగం వల్ల జీవ వైవిధ్యం తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని.అనేక జీవ జాతులు అంతరించిపోతున్నాయని. ఇది కేవలం ప్రకృతి నష్టమే కాదు — మానవ సమాజ భవిష్యత్తుకు ముప్పని .జీవ వైవిధ్యం మనకు ఆహారం,ఔషధాలు, నీరు, వాతావరణ సమతుల్యతను అందిస్తోంది.ప్రకృతి వ్యవస్థలు కూలిపోతే ఆ ప్రభావం నేరుగా మానవ జీవనంపై పడుతుందని . అందుకే జీవ వైవిధ్య పరిరక్షణ అనేది ఒక ఎంపిక కాదు — అది అత్యవసర బాధ్యతని .శాస్త్రీయ పరిశోధనలతో పాటు, స్థానిక జ్ఞానం, సంప్రదాయ పద్ధతులను కూడా పరిరక్షణలో భాగం చేయాల్సిన అవసరం ఉందని .ముఖ్యంగా యువత పాత్ర అత్యంత కీలకమని.నేటి విద్యార్థులే రేపటి విధాన రూపకర్తలు,శాస్త్రవేత్తలు, నాయకులు.వారికి ప్రకృతి పట్ల బాధ్యతా భావం,సుస్థిర అభివృద్ధి విలువలు అలవడితేనే నిజమైన మార్పు సాధ్యమని కోరారు. ఆచార్య మధు సూదన రెడ్డి, యోగివేమన విశ్వ విద్యాలయం కడప , భారతదేశంలోని తూర్పు కనుమల జీవ వైవిధ్యానికి నిలయంగా ప్రసిద్ధి చెందాయని. ముఖ్యంగా ఇక్కడ మాత్రమే కనిపించే ఎండెమిక్ (స్థానిక) మొక్కలు మరియు అంతరించిపోతున్న అపాయం ఎదుర్కొంటున్న వృక్షజాతులు దేశానికి అమూల్యమైన సహజ సంపదగా నిలుస్తున్నాయని.అయితే అరణ్య నరుకుడు,గనుల తవ్వకం, పట్టణీకరణ, అడవుల్లో అగ్నిప్రమాదాలు మరియు వాతావరణ మార్పుల వల్ల ఈ విలువైన మొక్కలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని .
ఈ ప్రాంతాల్లో ఉన్న అనేక ఔషధ మొక్కలు, అరుదైన చెట్లు మరియు పొదలు మానవ అవసరాల కోసం అధికంగా వినియోగించబడటంతో వేగంగా తగ్గిపోతున్నాయని. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మొక్కలను వాటి సహజ నివాస ప్రాంతంలోనే సంరక్షించడం అత్యంత అవసరమైందని. సహజ వాతావరణంలోనే మొక్కలను రక్షించడం ద్వారా వాటి జన్యు వైవిధ్యం,పునరుత్పత్తి సామర్థ్యం మరియు పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని. తూర్పు ఘాట్లలోని అపాయం ఎదుర్కొంటున్న మరియు స్థానిక మొక్కల సంరక్షణ అనేది కేవలం అటవీ సమస్య మాత్రమే కాదని, అది మన భవిష్యత్ తరాల పట్ల ఉన్న బాధ్యత. ఈ సహజ సంపదను కాపాడటం ద్వారా జీవ వైవిధ్యాన్ని రక్షించడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతను కూడా నిలబెట్టగలుగుతామని విద్యార్డులకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. అజర్బైజాన్ దేసం నుండి ఫిరోజ్ ష ఆన్ లైన్ ద్వారా వెదురు వ్యాప్తి దాని యొక్క ప్రాముఖ్యతను తెలియ జేశారు. ఆచార్య వెంకయ్య, ఆంధ్ర విశ్వవిద్యాలయం,విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నందు తూర్పు కనుమలలో ఉండే వృక్ష సంపద మరియు వాటి వ్యాప్తి, ఉపయోగాలు,ఏ వ్యాదికి ఏ మొక్క, ఏ భాగం, ఎలా ఉపయోగించాలి అనే అంశాలు మరియు గిరిజన ప్రజల ఉపయోగించే ఔషదాలు, వనా మూలికల గూర్చి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. డా.శంకర రావు , శాస్త్ర వేత్త , బొటానికల్ సర్వే ఒఫ్ ఇండియా విద్యార్డులకు అరుదైన మొక్కల యొక్క వివరాలు తెలియ జేశారు. ఈ సందర్భంగా పలువురు అంతర్జాతీయ నిపుణులు తమ పరిశోధన ఫలితాలను ప్రదర్శించగా, జీవ వైవిధ్య పరిరక్షణకు వినూత్న పరిష్కారాలు, విధాన సూచనలు ప్రతిపాదించబడ్డాయి. విద్యార్థులు మరియు యువ పరిశోధకులకు ఇది విలువైన జ్ఞాన వేదికగా నిలిచింది. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రభుత్వాలు, సంస్థలు మరియు సమాజం కలిసి పనిచేసినప్పుడే ప్రకృతి సమతుల్యతను కాపాడగలమని వక్తలు అభిప్రాయపడ్డారు.కార్యక్రమానికి కన్వెనెర్స గా డా. ప్రయాగ మూర్తి ప్రగడ, డా.ఎస్‌కే మదీనా, కొ – కన్వెనెర్స వేంకటేశ్వర రావు, కె . సురేశ్ , ఒర్గనైజింగ్ సెక్రెటరీస్ డా. శివ ప్రసాద్, మరియు వీరభద్రరావు ఒర్గనైజింగ్ మెంబర్స్ గా శ్రీలక్ష్మి, డా. బంగార్రాజు, మేరీ రోజాలిన, పుష్ప,సతీశ్, రాజేశ్, సత్యనారాయణ, ధర్మ రాజు,దివ్య,రామలక్ష్మి, కమల , కళావతి పెద్ద స వివిద కళాశాలల విద్యార్డులు, అధ్యాపకులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *