బంగారుపాళ్యం, మన ధ్యాస, జనవరి 29

చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం , బంగారుపాళ్యం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ కుమార్ రాజా నివాసం నందువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలేరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో ముఖ్య అతిధి గా పాల్గొన్నపూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలు పూర్తి కాకమునుపే టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా విసుగు చెందారని.ఈ ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వేధించడం తప్పిస్తే ప్రజలకు చేసిన మేలు శూన్యమని, 2029 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు గ్రామ కమిటీలను మరియు అనుబంధ విభాగాల కమిటీ బలోపేతం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు ఇవ్వనున్న ఐడీ కార్డులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని రాబోవు మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు కూడా గ్రామకమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతుందని ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది..ఈ కార్యక్రమం లో మండల పార్టీ కన్వీనర్ రామచంద్రా రెడ్డి,రాష్ట్ర పాల ఏకరి విభాగం అధ్యక్షులు ఎం.బి.కుమార్ రాజా,మాజీ సింగిల్ విండో చైర్మెన్ దత్తాత్రేయ రెడ్డి,పాలెరు సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర సోషియల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి సర్దార్,జిల్లా ట్రేడ్ యునియన్ ఉపాద్యక్షుడు అన్ను,జిల్లా ట్రేడ్ యునియన్ కార్యదర్శి రఘుపతి రాజు,నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షులు పాలాక్షిరెడ్డి,మండల యువజన విభాగం అధ్యక్షులు గజేంద్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు వాణిప్రియా,బి.సి.విభాగం అధ్యక్షులు మోగిలీశ్వర్, మైనార్టీ విభాగం అధ్యక్షులు షాకీర్,
బుత్ కమిటీ అధ్యక్షులు భానుప్రకాష్, సోషియల్ మీడియా అధ్యక్షులు శైలేష్ బాబు, క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు యోహాన్,వాలంటీర్ల విభాగం అధ్యక్షులు సుదర్శన్,నాయకులు మహేంద్ర,ముబారక్, ఖాదర్,జగదీష్,దేవా,చిన్నా,తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *