సముద్ర స్నానానికి బయలుదేరిన మానసా దేవి అమ్మవారు..ప్రారంభమైన మానసా దేవి అమ్మవారి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు..

వరికుంటపాడు జూలై 8, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ మానసా దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ద్వాదశ వార్షిక సముద్ర స్నాన మహోత్సవం దేవస్థానం వద్ద నుంచి ప్రత్యేక రథంపై ఊరేగుతో సింగరాయకొండ వద్ద ఉన్న పాకాల వద్ద సముద్ర స్నానానికి పయనమయ్యారు. మార్గమధ్యమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోటపాటి జనార్దన్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఉత్సవాలు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి వద్ద సంతానం లేని భక్తులు వరపడితే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రాంత ప్రజల నమ్మకం. ఈ ఉత్సవాలను చల్లా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని పలు రకాల పుష్పాలతోనూ విద్యుత్ దీపాలతోనూ సుందరంగా అలంకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *