
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు వనం మంగా శ్రీనివాస్ అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక శివాలయం లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీతల నూకరాజు,తెలుగుదేశం నాయకులు దనేకుల వీరభద్రం, దనేకుల అదృష్టదీపుడు, సంఘన ప్రపోజి, తెలుగుదేశం జిల్లా sc సెల్ సెక్రటరీ బచ్చల నాగ శివ, చిలకమర్తి ఆదినారాయణ,జనసేన పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ సర్పంచ్ సాగి వెంకటరమణ, సాగి బంగార్రాజు, దొడ్డి దుర్గాప్రకాస్, సాల వీరబాబు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొని మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు