మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామములో పశు వైద్యాధికారి మంజూష ఆద్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కూటమి నాయకులు నీరుకొండ సత్యనారాయణ,బసా ప్రసాద్, మైరాల కనకరావు హాజరయ్యారు.ఈ పశు ఆరోగ్య శిబిరం లో పశువుల ఆరోగ్య తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.గర్భం తదితర వ్యాధులకు సంబంధించిన వైద్యాన్ని పశువులకు అందించి మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పశువర్ధక శాఖ అధ్వర్యంలో ఈ నెల 19 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకూ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నామన్నారు.
ఈ ఆరోగ్య శిబిరాల ద్వారా గ్రామాల్లో రైతులకు తమ యొక్క పశువుల వ్యాధి తదితర అంశాలపై అవగాహనతో పాటు నివారణకు ఎంతగానో ఉపయోగపడునాయన్నారు.రైతులు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో. సిబ్బంది అసిస్టెంట్లు వంశీ, శ్రీనివాస్,హుసేన్ పద్మలత, పలువురు పాడి రైతులు పాల్గోన్నారు…

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *