మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరంలో పట్టణంలో భీష్మ ఏకాదశి పర్వదనము సంద్రభంగా
శ్రీశ్రీశ్రీ రాజారాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారికి ఆలయానికి బదిరెడ్డి గోవిందు అధ్వర్యంలో ప్రతేక పూలతో అలంకరించారు. ఈ సందర్భగా తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
తొలి పూజను ఆనవాయితీ ప్రకారం బదిరెడ్డి గోవిందు దంపతులు, కుటుంబ సభ్యులు చేతుల మీదుగా జరిపించారు.ఆలయాలలో భజనలు, భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.ఈ సందర్భముగా బదిరెడ్డి గోవిందు మాట్లాడుతూ,వంశపారపర్యంగా,మా తాతల కాలం నుండి ప్రతీ ఏటా భీష్మ ఏకాదశి పర్వదినాన మా కుటుంబ సభ్యులచే స్వామివారికి ఆలయానికి ప్రత్యేక పుష్పాలతో అలంకరణ కొనసాగిస్తున్నామని అన్నారు.తెల్లవారు తొలి పూజలో మా కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ భీష్మ ఏకాదశి పర్వదినము సందర్భముగా ప్రతీ ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని రాజారాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా గోవిందు తెలిపారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *